Header Banner

పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్!

  Sat Apr 12, 2025 07:11        Politics

విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి-65ని ఆరు వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఎఐ) కార్యాచరణ ఆరంభించింది. జాతీయ రహదారులను నౌకాశ్రయాలకు అనుసంధానం చేసే ప్రాజెక్టులో భాగంగా ఈ రహదారిని మచిలీపట్నం పోర్టు వరకూ విస్తరిస్తారు. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేస్తున్నారు.
• విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారి 63 కి. మీ. మేర ఉంది. ఇందులో అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు కంకిపాడు-ఉయ్యూరు మధ్య చలివేంద్రపాలెం సమీపంలో క్రాస్ అవుతుంది. అక్కడి నుంచి మచిలీపట్నం వరకు 44 కి. మీ. మేర ప్రస్తుతమున్న నాలుగు వరుసల మార్గాన్ని.. ఆరు వరుసలుగా విస్తరిస్తారు.
• మచిలీపట్నం వద్ద ఒంగోలు-కత్తిపూడి జాతీయ రహదారి రెండు వరుసలుతో ఉంది. ఇందులో మాచవరం రైస్ మిల్లు వరకు 4 కి. మీ. నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.
• మాచవరం రైస్ మిల్లు వద్ద నుంచి పోర్టుకు 3.7 కి.మీ.లను నాలుగు వరుసలతో కొత్తగా రహదారిని నిర్మిస్తారు.
• వీటిలో ఆరు వరుసలుగా విస్తరించనున్న 44 కి. మీలతోపాటు 3.7 కి.మీ. మేర నాలుగు వరుసల హైవే నిర్మాణాన్ని ఎన్హెచ్ఎఐ చేపడుతుంది.
• ఒంగోలు-కత్తిపూడి హైవేలో 4 కి.మీ మేర విస్తరించే పనులను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) పర్యవేక్షిస్తుంది.
• మొత్తంగా ఈ రహ

ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

దారికి చెందిన డీపీఆర్ తయారీ బాధ్యత చైతన్య, ఎంఎస్ పార్క్ జేవీ సంస్థకు అప్పగించారు.





   #andhrapravasi #NH65Expansion #PortConnectivity #SixLaneHighway #NHAI #VijayawadaToMachilipatnam